హైదరాబాదులో పాస్ పోర్ట్ మెగా మేళా... ఎప్పుడంటే...!

  • పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం మే 9న ప్రత్యేక మేళా
  • హైదరాబాద్ రీజియన్‌లో 4,000 అదనపు స్లాట్ల విడుదల
  • 8-10 రోజుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యం
  • మే 4 నుంచి కరీంనగర్ పీఎస్‌కే సామర్థ్యం పెంపు
పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో) శుభవార్త చెప్పింది. వేసవిలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని, అపాయింట్‌మెంట్ల కోసం నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు మే 9న ప్రత్యేకంగా "పాస్‌పోర్ట్ మేళా" నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేళాలో భాగంగా నార్మల్ కేటగిరీ కింద 4,000 అదనపు అపాయింట్‌మెంట్ స్లాట్లను విడుదల చేస్తున్నట్లు హైదరాబాద్ ఆర్పీవో జె. స్నేహజ తెలిపారు.

హైదరాబాద్ పరిధిలోని బేగంపేట, ఎంజీబీఎస్ మెట్రో, రాయదుర్గం పీఎస్‌కేలకు 3,100 స్లాట్లు, కరీంనగర్, నిజామాబాద్ పీఎస్‌కేలకు 900 స్లాట్లు కేటాయించారు. ఈ అదనపు స్లాట్లు తత్కాల్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) సేవలకు వర్తించవని స్పష్టం చేశారు. ప్రస్తుతం 8 నుంచి 10 రోజులుగా ఉన్న అపాయింట్‌మెంట్ నిరీక్షణ కాలాన్ని 5 నుంచి 7 రోజులకు తగ్గించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని స్నేహజ వివరించారు.

సేవల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, మే 4 నుంచి కరీంనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్‌కే) రోజువారీ అపాయింట్‌మెంట్ల సామర్థ్యాన్ని 220 నుంచి 400కి పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ passportindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.
 

Passport Mega
Hyderabad
J Snehaja

More Telugu News